Sun Mar 15 2026 20:18:17 GMT+0530 (India Standard Time)
నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం
టీ 20 వరల్డ్ కప్ లో జట్టును ఎంపిక చేయడం కోసం నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది

టీ 20 వరల్డ్ కప్ లో జట్టును ఎంపిక చేయడం కోసం నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ సమావేశంలో పూర్తిగా జట్టు ఖరారు కాకున్నా ఒక అంచనాకు మాత్రం వచ్చే అవకాశముంది. ఈరోజు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ లు సమావేశం కానున్నారు.
ప్రపంచ కప్ జట్టు కోసం...
టీ 20 ప్రపంచ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పదిహేను మంది జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈరోజు బీసీీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. పదిహేను మంది ఆటగాళ్ల పేర్లపై ఒకఅంచనాకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఉత్తమ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముందని తెలిసింది.
Next Story

