Tue Jan 20 2026 06:11:47 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ జట్టుకు శనిలా దాపురించారుగా?
టీం ఇండియా వరస ఓటములపై బీసీసీఐ పోస్టుమార్టం చేయాల్సి ఉంది

టీం ఇండియా వరస ఓటములపై బీసీసీఐ పోస్టుమార్టం చేయాల్సి ఉంది. బీసీసీఐ టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ పై ఎందుకు అంత ప్రేమ చూపుతుందో అర్థం కావడం లేదు. ఆటగాళ్లతో ఎలా కలసి మెలసి ఉండాలో తెలియదు. తాను తోపు అన్నట్లు పెద్ద పోజులివ్వడం తప్పించి టీం ఇండియాను క్రికెట్ పరంగా అట్టడుగు చేర్చడానికే గౌతమ్ గంభీర్ కంకణం కట్టుకున్నట్లుంది. అంతకు ముందు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో టీం ఇండియాకు ఎన్నివిజయాలు? ఎన్ని రికార్డులు? ఇప్పుడు అవి ఏవి? ఆటగాళ్లలో లోపమా? లేదంటే కోచ్ మనకు శాపమా? అన్న కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి.
న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను...
తాజాగా న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను భారత్ కోల్పోవడంతో గౌతమ్ గంభీర్ ను టీం ఇండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని క్రికెట్ ఫ్యాన్స్ పెద్దయెత్తున పోస్టులు పెడుతున్నారు. గంభీర్ ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. మంచి ఆటగాళ్లున్నప్పటికీ చెత్త వ్యూహాలతో గౌతమ్ గంభీర్ ఆటను తగలపెడుతున్నాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ జట్టు ప్రయోజనాలతో పాటు ఆటగాళ్ల సమిష్టిగా ఆడే పరిస్థితి నుంచి బయటకు తీసుకు రావడం వల్లనే ఈ వరస అపజయాలంటూ అనేక మంది మండి పడుతున్నారు. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతనే టీం ఇండియా అనేక మ్యాచ్ లలో తడబడటానికి కారణం అని అంటున్నారు.
వరస ఓటములతో...
ఆస్ట్రేలియాలోతో జరిగిన టెస్ట్ సిరీస్ ను కోల్పోయాం. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. వన్డే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇంత దయనీయ స్థితిలో ఉండటానికి ఇద్దరే కారణమంటున్నారు. ఒకరు గౌతమ్ గంభీర్ అయితే.. మరొకరు అగార్కర్. ఇద్దరూ చేరి టీంఇండియాకు హిస్టరీలో లేని విధంగా చెత్త రికార్డులను తేవడానికే పనిగట్టుకు వచ్చినట్లు కనపడుతుందన్న వ్యాఖ్యలు దర్శనమిస్తున్నాయి. ఇకనైనా గౌతమ్ గంభీర్ ను హెచ్ కోచ్ పదవి నుంచి తప్పించకుండా బీసీసీఐ రాజకీయ కోణంలో ఆలోచిస్తే మాత్రం ప్రపంచం ఎదుట భారత్ జట్టు పేలవ ప్రదర్శన ఎన్ని సార్లు చూడాల్సి వస్తుందో లెక్క లేదంటున్నారు. అందుకే వెళ్లవయ్యా.. వెళ్లూ... అని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story

