Sat Dec 06 2025 02:29:57 GMT+0000 (Coordinated Universal Time)
BCCI : బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ అధికారికంగా ఎన్నికయ్యారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ అధికారికంగా ఎన్నికయ్యారు. ఆదివారం ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన ఏకగ్రీవంగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడో క్రికెటర్‌గా ఈ పదవి చేపట్టిన మన్హాస్, సౌరవ్ గంగూలీ, రాజర్ బిన్నీ తర్వాత ఈ జాబితాలో చేరారు. నలభై ఐదేళ్ల మన్హాస్, రాజర్ బిన్నీ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేసిన ఆయన, బోర్డు కీలక నిర్ణయాధికారుల చర్చల తర్వాత ప్రధాన అభ్యర్థిగా నిలిచారు.
కొత్త బోర్టులో...
బీసీసీఐ కొత్త బోర్డును ప్రకటించింది. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎన్నికయ్యారు. గౌరవ కార్యదర్శిగా దేవజిత్ సైకియా బాధ్యతలు స్వీకరించారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, ఖజానాదారుగా ఎ. రఘురాం భట్ లు ఎన్నికయ్యారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా జయ్‌దేవ్ నిరంజన్ షా నియమితులయ్యారు. గవర్నింగ్ కౌన్సిల్లో అరుణ్ సింగ్ ధూమల్, ఎం. ఖైరుల్ జమాల్ మజుందార్ వంటి వారు చేరారు.
ఇంతకీ మిథున్ మన్హాస్ ఎవరంటే?
మిధున్ మన్హాస్ భారతీయ క్రికెట్ జట్టులో ఆడలేదు. అయినా సరే దేశవాళీ క్రికెట్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1979 అక్టోబర్ 12న జమ్మూకాశ్మీర్‌లో మిధున్ మన్హాస్ జన్మించారు. రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా, అప్పుడప్పుడూ ఆఫ్ స్పిన్ బౌలర్‌గా, వికెట్ కీపర్‌గా కూడా జట్టుకు సేవలందించారు. 2007-08 సీజన్లో 921 పరుగులు చేసి ఢిల్లీకి రంజీ ట్రోఫీ గెలిపించిన సందర్భం ఆయన కెరీర్లో ముఖ్యమైన మలుపు. మొత్తం 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 9,714 పరుగులు చేశారు. 27 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలను మిధున్ మన్హాస్ నమోదు చేశారు. 2008-2010 మధ్య కాలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్ ఆరంభించారు. ఆ తర్వాత 2011-2013లో పుణే వారియర్స్, 2014లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడారు.
Next Story

