ఆ ఐపీఎల్ టీమ్ కు 538 కోట్లు బీసీసీఐ కట్టాల్సిందే
కొచ్చి టస్కర్స్.. ఐపీఎల్ ను ముందు నుండి ఫాలో అయ్యే వాళ్లకు ఈ టీమ్ పరిచయమే!!

కొచ్చి టస్కర్స్.. ఐపీఎల్ ను ముందు నుండి ఫాలో అయ్యే వాళ్లకు ఈ టీమ్ పరిచయమే!! 2011 సీజన్ మాత్రమే ఈ జట్టు ఐపీఎల్ లో ఉంది. ఇప్పుడు బీసీసీఐకి ఈ జట్టు విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోచ్చి టస్కర్స్ కు 538 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మధ్యవర్తిత్వ ప్యానల్ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది.
కొచ్చి టస్కర్స్ జట్టును బీసీసీఐ 2011 సెప్టెంబరులో ఐపీఎల్ నుంచి తొలగించింది. ఆ జట్టు యాజమాన్యం 156 కోట్ల రూపాయల వార్షిక బ్యాంకు గ్యారంటీని సమర్పించలేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐతో ఉన్న ఒప్పందంలోని నిబంధనల ఉల్లంఘన అంటూ కొచ్చి జట్టు యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. 2015లో ఆర్బిట్రేటర్ జస్టిస్ లహోటి నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ కొచ్చి టస్కర్స్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పును బీసీసీఐ బాంబే హైకోర్టులో సవాలు చేయగా.. తాజాగా వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

