Thu Mar 19 2026 05:29:29 GMT+0530 (India Standard Time)
ఇక ఆ ఒక్క ఫార్మాట్ కే కొహ్లి
భారత్ క్రికెట్ వన్డే క్రికెట్ కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది

భారత్ క్రికెట్ వన్డే క్రికెట్ కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీ 20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి విరాట్ కొహ్లీ తప్పుకోవడంతో రోహిత్ శర్మకు అవకాశమిచ్చారు. ఇప్పుడు వన్డే కు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ గా వ్యవహరిస్తారని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
టెస్ట్ జట్టులోనే....
దీంతో విరాట్ కోహ్లి ఇక టెస్ట్ జట్టుకు మాత్రమే టీం ఇండియా కెప్టెన్సీగా వ్యవహరిస్తారు. కెప్టెన్సీ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత విరాట్ కొహ్లి ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. అంకెలు కూడా అదే చెబుతున్నాయి. విరాట్ కొహ్లి కూడా ఆట మీద దృష్టి పెట్టడానికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
Next Story

