Thu Dec 18 2025 13:44:49 GMT+0000 (Coordinated Universal Time)
Team India : శ్రీలంక టూర్ కు టీం ఇండియా స్కాడ్ ఇదే
శ్రీలంక పర్యటనకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు టీం ఇండియా ఆడనుంది.

శ్రీలంక పర్యటనకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు టీం ఇండియా ఆడనుంది. ఈనెల 27వ తేదీ నుంచి టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే రెండు జట్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కెప్లెన్లను వేర్వేరుగా నియమించింది. భారత్ టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తాడు.
వన్డే జట్టుకు...
వన్డే జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉంటాడు. టీ20 జట్టులో సూర్యకుమార్ యాదవ్, గిల్, జైశ్వాల్ ,రింకూ సింగ్, పరాగ్, పంత్, సంజూ, పాండ్యా, దూబే, అక్షర్ పటేల్, సుందర్, రవిబిష్నోయ్, అర్ష్‌దీప్, ఖలీల్, సిరాజ్ ను ఎంపిక చేశారు. వన్డే జట్టులో రోహిత్‌శర్మ, కొహ్లీ, గిల్, రాహుల్, పంత్, శ్రేయాస్, దూబే, కుల్దీప్,సిరాజ్, సుందర్, అర్ష్‌దీప్, పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రానాను ఎంపిక చేసింది.
Next Story

