Sun Feb 22 2026 11:43:22 GMT+0530 (India Standard Time)
India vs South Africa : భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు..పిచ్ రిపోర్ట్ ఏంటంటే?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు జరగనుంది

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిగా రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు సమఉజ్జీలు కావడంతో గెలుపుపై అంచనాలు దొరకడం లేదు. క్రికెట్ లో అందులోనూ టీ20లో ఆరోజు ఎవరిది పై చేయి అవుతుందో వారిదే విజయం అవుతుంది. మరొక వైపు లక్ కూడా కలసి రావాల్సి ఉంటుంది. అనేక మ్యాచ్ లు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్టు ప్రపంచ కప్ నుంచి అవుట్ కావడమే ఇందుకు ఉదాహరణ. అందుకే ఏదైనా జరగొచ్చు. టీం ఇండియా, సౌతాఫ్రికాలు రెండు లీగ్ మ్యాచ్ లలో వరస విజయాలతో సూపర్ 8కు అర్హత సాధించి టాప్ లో ఉన్నాయి.
గణాంకాలు చూస్తే...
అయితే దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలో మళ్లీ పుంజుకుంది. భారత్ పై గణాంకాలు పెద్దగా లేవు. గత వరల్డ్ కప్ లోనూ ఫైనల్స్ లో తలబడి కప్పును చేజార్చుకున్న సౌతాఫ్రికా ఈసారి టీం ఇండియాపై కసి తీర్చుకోవాలని భావిస్తుంది. సౌతాఫ్రికాలో బ్యాటర్లు అందరూ మంచి ఫామ్ లో ఉండటంతో పాటు కొద్ది రోజుల క్రితమే ఆ జట్టు భారత్ లో పర్యటించడం కూడా ఇక్కడి మైదానాలకు అలవాటు పడిందని అంటున్నారు. అదే సమయంలో బౌలింగ్ లోనూ సౌతాఫ్రికా విషయంలో ఆచి తూచి ఆడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ లోనూ అత్యుత్తమ జట్టుగా పేరుంది. ఇన్ని కలసి ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకూ ప్రపంచ కప్ లో లక్ ముఖం చాటేసింది.
భారత్ మంచి ఊపు మీద...
మరొకవైపు భారత్ కూడా మంచి ఊపు మీద ఉంది. నాలుగు విజయాలతో టీం ఇండియా కూడా సూపర్ 8కు చేరుకుంది. మంచి బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుగా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. వన్డే, టెస్ట్ లను పక్కన పెడితే టీం ఇండియా టీ20 హిస్టరీ చూస్తే గెలుపు దానిపైనే మొగ్గు చూపాల్సి ఉంటుంది. అయితే అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లు విఫలమవుతుండటం జట్టుకు కొంత ఇబ్బందిగా మారింది. అభిషేక్ ను మారుస్తారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ అతను క్లిక్ అయితే మంచి స్కోరు సాధిస్తాడని ఆడించవచ్చు. అందుకే ఈ మ్యాచ్ మాత్రం రెండు దిగ్గజాల మధ్య పోరు క్రికెట్ ప్యాన్స్ ను అలరించక తప్పదు. అందుకే ఈ మ్యాచ్ మాత్రం టీ20 ప్రపంచ కప్ కే హైలెట్. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారనుంది. భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని క్రీడానిపుణులు చెబుతున్నారు.
Next Story

