Fri Mar 20 2026 18:09:00 GMT+0530 (India Standard Time)
నేడు బంగ్లాదేశ్ - భారత్ వన్డే
నేటి నుంచి బంగ్లాదేశ్ - భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నేడు తొలి వన్డే మ్యాచ్ జరగనుంది

నేటి నుంచి బంగ్లాదేశ్ - భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నేడు తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప ్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ లో భారత్ ఆడనుంది. రోహిత్, శిఖర్ ధావన్ లు ఓపెనర్ లుగా దిగనున్నారు. గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమి వన్డే సిరీస్ కు దూరం అయ్యారు. రిషబ్ పంత్ కు చోటు కల్పిస్తారా? లేదా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది.
బలమైన జట్టుగా...
అయితే వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా రిషబ్ పంత్ కు ఈ మ్యాచ్ లో అవకాశం ఇవ్వవచ్చని చెబుతున్నారు. బంగ్లాదేశ్ కూడా పటిష్టంగానే ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ లో ఆ జట్టు మొన్న టీ 20 వరల్డ్ కప్ లో ప్రత్యర్థులకు దడపుట్టేలా చేసింది. దీంతో ఆచి తూచి ఆడాల్సిన ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ జట్టులోనూ కొన్ని మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Tags
- bangladesh
- india.
Next Story

