India vs Pak T20 World Cup : భారత్ పై ఓటమితో పాక్ పై సొంత దేశంలో దుమారం.. బాయ్ కాట్ చేయాల్సిందంటూ?
టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో భారీ పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి పాలవడంతో ఆ దేశ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో భారీ పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి పాలవడంతో ఆ దేశ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కొలంబోలో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ తర్వాత మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు సీనియర్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు మాజీ క్రికెటర్లు అతడిని టీ20 జట్టులోంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కూడా పాక్ టీంపై ధ్వజమెత్తుతున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్ పై ఎన్నడూ చూడని ఆటని చూపించారని సెటైర్లు వేస్తున్నారు. ఈ ఏకపక్ష మ్యాచ్‌లో బాబర్‌తో పాటు సీనియర్ స్పిన్నర్ షాదబ్, ప్రధాన పేసర్ షాషీన్ షా ఆఫ్రిదీ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. పాకిస్థాన్ బౌలింగ్‌ను యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ వీర విహారాన్ని అదుపు చేయలేకపోవడం పాక్ జట్టు వైఫల్యమేనంటున్నారు. ఆప్ఘనిస్తాన్, బలూచిస్తాన్ లోనూ పాక్ కు వ్యతిరేకంగా సంబరాలు చేసుకున్నారు.

