Mon Dec 08 2025 10:37:11 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన భారత్
ఆస్ట్రేలియా - భారత్ వన్డే మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది

ఆస్ట్రేలియా - భారత్ వన్డే మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబైలో వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలుపు కోసం ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు నియంత్రించగలిగితేనే భారత్ కు ఛేదన సాధ్యమవుతుంది. రోహిత్ శర్మ ఇంట పెళ్లి వేడుకలు ఉండటంతో ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. దీంతో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీగా వ్యవహరిస్తున్నారు.
కీలకంగా మారిన వన్డే....
ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉంది. ప్రధానంగా బ్యాటర్లు ఫామ్ లో ఉన్నారు. ప్రపంచకప్ కు ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరు జట్లు సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో గెలుపు ఎవరికైనా అవసరం. రెండో మ్యాచ్ విశాఖలో ఈ నెల 19వ తేదీ జరగనుంది. అయితే వర్షాలు కురుస్తున్నందున ఈ మ్యాచ్ నీలి మేఘలు కమ్ముకున్నాయి. అందుకే ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకమనే చెప్పాలి.
Next Story

