Fri Dec 05 2025 17:50:52 GMT+0000 (Coordinated Universal Time)
Rohan Bopanna : రోహన్ బోపన్న గెలిచాడోచ్
43 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న తొలి గ్రాండ్ శ్లామ్ గెలిచారు, ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ లో విజయం సాధించాడు

43 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న తొలి గ్రాండ్ శ్లామ్ గెలిచారు. ఆస్ట్రేలియా ఓపెన్ లో విజయం సాధించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పెద్ద వయసులో గ్రాండ్ శ్లామ్ గెలిచి చరిత్ర సృష్టించాడు. రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్ తో కలసి మెన్స్ డబుల్స్ టైటిల్స్ ను గెలుచుకున్నాడు.
61 సార్లు పోరాడి...
ఈ జోడీ సిమోన్ బొలెలి - ఆండ్రియా వవస్సోరి పై గెలిచి టైటిల్ ను గెలుచుకున్నారు. బోపన్న జోడీ తమ ప్రత్యర్థులపై 7 - 6, 7 -5 తేడాతో టైటిల్ ను గెలుచుకున్నారు. దాదాపు 61 సార్లు శ్రమించిన తర్వాత రోహన్ బోపన్న తొలి గ్రాండ్ శ్లామ్ గెలుచుకున్నారు. నిన్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని కూడా ప్రకటించింది. గెలిచిన వెంటనే బోపన్న ఉద్వేగానికి లోనయ్యారు.
Next Story

