Fri Dec 05 2025 08:27:09 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : నేటి నుంచి ఆసియా కప్ ఛాంపియన్ ట్రోఫీ
నేటి నుంచి ఆసియా కప్ టీ20 ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం కానుంది.దుబాయ్ వేదికగా నేటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.

నేటి నుంచి ఆసియా కప్ టీ20 ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా నేటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. క్రికెట్ ఫ్యాన్స్ కు నేటి నుంచి పండగేనని చెప్పాలి. ఈరోజ తొలి మ్యాచ్ లో అబుదాబిలో ఆఫ్గనిస్తాన్ తో హాంకాంగ్ తలపడనుంది. రేపు యూఏఈతో టీం ఇండియా ఆడనుంది. ఈరోజు నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి.
రెండు గ్రూపులుగా విభజించి...
ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో భారత్, పాకిస్థాన్, ఒమన్, యూఏఈ దేశాలకు చెందిన జట్లు న్నాయి. గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ లు ఉన్నాయి. ఈ నెల 14వ తేదీన భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏ లోనే భారత్, పాకిస్థాన్ ఉండటంతో ఈ టోర్నీలో అన్ని సజావుగా జరిగితే మూడు సార్లు పోటీ పడే అవకాశముందని అంటున్నారు. టైటిల్ ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగనుంది.
Next Story

