Fri Dec 05 2025 16:40:21 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : భారత్ - పాక్ మ్యాచ్ గుండెలే కాదే.. టీవీలు కూడా బద్దలవుతాయ్
ఆసియాకప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఈ నెలలోనే జరుగుతుంది. ఈ నెల 14 వతేదీన దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది

ఆసియాకప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఈ నెలలోనే జరుగుతుంది. ఈ నెల 14 వతేదీన దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతుండటంతో రెండు దేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్ లో గూస్ బమ్స్ రావడం ఖాయం. అలాగే టెన్షన్ పెట్టే మ్యాచ్ ఇది ఖచ్చితంగా అవుతుంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్నమ్యాచ్ తమదే గెలుపు కావాలని ఎవరికి వారు కోరుకుంటారు. ఓటమి చెందితే గుండెలు మాత్రమే కాదు చూస్తున్న టీవీలు కూడా బద్దలవుతాయి. ఆ రేంజ్ లో రెండు దేశాల మ్యాచ్ జరుగుతుందన్నది వాస్తవం. ఈమ్యాచ్ ను చూసేందుకు ఇప్పటికే దుబాయ్ వెళ్లేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. పేరుకు దాయాదుల పోరు అయినా రెండు దేశాల మధ్య ఫైట్ అని చెప్పక తప్పదు.
వేదిక ఎక్కడైనా...
భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా రెండు దేశాల మధ్య ఉత్కంఠ మాత్రం యుద్ధం జరిగే తరహాలో ఉంటుంది. యుద్ధంలో వజయాపజయాలుగానే ఈ క్రికెట్ మ్యాచ్ లో గెలుపోటములను చూడటం అలవాటుగా మారింది. కేవలం మ్యాచ్ మాత్రమే కాదు.. సిక్సర్ కొట్టినా, ఫోర్ బాదినా, వికెట్ తీసినా మైదానంలోనే కాదు.. ఇళ్లలోనూ, వీధుల్లోనూ కేరింతలు, ఈలలు వినిపిస్తాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భారత్ - పాక్ మ్యాచ్ అంటే రెండు దేశాల క్రికెట్ బోర్డులకు కనకవర్షం కురిపిస్తుంది. టిక్కెట్ ధరను చూడరు. అలాగే స్పాన్సర్ షిప్ విషయంలోనూ ఏ కంపెనీ కూడా వెనకడాని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇరుదేశాలు ఆడే మ్యాచ్ లకు వ్యూయర్ షిప్ కూడా ఎక్కువగా ఉంటుంది.
అత్యధికమైన వ్యూయర్ షిప్...
కేవలం టీవీల్లో మాత్రమే కాదు.. సెల్ ఫోన్ లో కూడా జియో హాట్ స్టార్ ద్వారా చూసే వారు కోట్లాది మంది ఉంటారంటే అతి శయోక్తి కాదు. అలాంటి మ్యాచ్ కోసం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. కేవలం ముందుగానే బుక్ చేసుకోవడమే కాకుండా, బ్లాక్ లోనూ టిక్కెట్లను కొనుగోలు చేసేవారున్నారు. సినీ సెలబ్రిటీల నుంచి పారిశ్రామికవేత్తల వరకూ బ్లాక్ లోనైనా టిక్కెట్ కొనుక్కుని ఆరోజు జరిగే మ్యాచ్ కు దుబాయ్ కు వెలతారు. దీంతో బ్లాక్ మార్కెట్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బ్లాక్ లో దుబాయ్ లో ఈనెల 14వ తేదీన జరిగే మ్యాచ్ కు దాదాపు పదహారు లక్షల రూపాయల వరకూ ఒక టిక్కెట్ అమ్ముడు పోతుందని అంటున్నారు. అధికారికంగా టిక్కెట్లను త్వరలోనే విక్రయాలు ప్రారంభించలేదు. దీంతో బ్లాక్ టిక్కెట్ ధర అమాంతం పెరిగిందంటున్నారు. మొత్తం మీద దాయాదుల పోరులో ఎవరిది విజయమన్నది చూడాలి. భారత్ - పాక్ మ్యాచ్ లు ఎక్కువగా ఆదివారాలు మాత్రమే జరపడానికి కూడా ఇదే కారణం.
Next Story

