Fri Dec 05 2025 07:15:40 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : నేడు ఆసియా కప్ లో మరో ఆసక్తికర పోరు.. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్
ఆసియా కప్ మధ్య నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీం ఇండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది.

ఆసియా కప్ మధ్య నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీం ఇండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు భారత కాలమాన ప్రకారం ప్రారంభమవుతుంది. అయితే చిన్న జట్టు అని ప్రయోగాలకు పోతే ఒమన్ తో తృటిలో తప్పించుకున్న పరాజయం బంగ్లాదేశ్ విజయంలో ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని క్రీడారంగ నిపుణలు భారత్ జట్టును హెచ్చరిస్తున్నారు. సూపర్ 4 దశలో ప్రయోగాలు మంచి ఫలితాలు ఇవ్వవని కూడా చెబుతున్నారు. టీం ఇండియా ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్ లో గెలిచింది. ఒమన్, యూఏఐలను ఒక్కోసారి ఓడించి, పాకిస్తాన్ రెండు సార్లు ఓడించి భారత్ జట్టు బలంగా కనిపిస్తుంది.
బలంగా ఉన్న జట్లలో ఒకటిగా...
బంగ్లాదేశ్ కూడా బలంగా కనిపిస్తుంది. అది పసికూన మాత్రం కాదు. తక్కువం అచనా వేయడానికి వీలులేదు. బంగ్లాదేశ్ శ్రీలంక జట్టును ఓడించి రేసులో తాను ఉన్నానని చెప్పకనే చెప్పింది. అందుకే బంగ్లాదేశ్ పై ప్రయోగాలు చేయడం సముచితం కాదన్నది అందరి నోట వినిపిస్తున్న మాట. బంగ్లాదేశ్ లో మంచి హిట్టర్లున్నారు. స్పిన్నర్లు, పేసర్లున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బంగ్లాదేశ్ తీసివేయతగ్గ టీం కాదు. టీం ఇండియా తో పోల్చుకుంటే టీ 20లలో అంతటి ఘన చరిత్ర లేకపోయినా మైదానంలో చరిత్ర సృష్టించగల జట్టు బంగ్లాదేశ్ అన్నది మరిచిపోవద్దని అంటున్నారు. బంగ్లాతో గేమ్స్ వద్దు అంటూ సెటైరికల్ గా సోషల్ మీడియాలో పెద్దయెత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మూడు సార్లు ఫైనల్స్ కు...
బలమైన శ్రీలంకను ఓడించి రెట్టించిన ఉత్సాహంతో బంగ్లాదేశ్ మైదానంలోకి అడుగుపెడుతుంది. 2012లో బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించి మొదటిసారి ఆసియా కప్ లో ఫైనల్స్ కు చేరింది. ఫైనల్ లో పాక్ చేతిలో ఓటమి పాలయింది. 2016లో కూడా మళ్లీ బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. అప్పుడు భారత్ చేతిలో ఓటమి పాలయింది. 2018లోనూ బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. అంటే ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ కు చేరింది.అందుకే సూపర్ 4 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా వంటి వారు విపలమయ్యారని వారిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇప్పటి వరకూ ఆడిన జట్టుతోనే నేడు కూడా బంగ్లాదేశ్ తో ఆడితే విజయం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా ప్రయోగాలు చేయకుండా పాకిస్తాన్ కంటే మెరుగ్గా రాణిస్తున్న బంగ్లాదేశ్ తో భారత్ హోరాహోరీ పోరాడాల్సి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు.
Next Story

