Thu Jan 29 2026 19:54:50 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు మరో కీలక మ్యాచ్
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ నేడు తలపడనుంది.

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ నేడు తలపడనుంది. గౌహతి వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారనుంది. హైదరాబాద్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మంచి ప్రతిభ కనపర్చినా రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలయింది.
రెండు జట్లు ఓడి...
అలాగే తొలి మ్యాచ్ ఆడిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై ఓటమి పాలయింది. దీంతో ఇరుజట్లు ఐపీఎల్ తొలి విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. రెండు జట్లు బలంగానే ఉండటం, బౌలరలు, బ్యాటింగ్ పరంగా రెండు జట్లు పటిష్టంగా ఉండటంతో ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగే అవకాశముంది..
Next Story

