Fri Dec 05 2025 21:53:03 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు కసిగా ఆడే జట్లు రెండు ఢీ
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది

ఐపీఎల్ ఈ సీజన్ లో మాత్రం ఏ జట్లు ప్లేఆఫ్ కు వస్తాయన్నది అంచనా వేయలేకపోతున్నాం. ఇప్పటి వరకూ అయితే ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత గుజరాత్, ఆ తర్వాత బెంగళూరు, నాలుగో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. ఈ నాలుగు జట్లకు పోటీగా లక్నో, కోల్ కత్తా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ కూడా ప్లేఆఫ్ కు పోటీపడుతున్నాయి. అయితే ఎవరు ప్లే ఆఫ్ కు వస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికి ఐపీఎల్ సీజన్ సగం మాత్రమే ముగిసింది. మరో సగం మిగిలి ఉండటంతో ఎవరు అత్యధిక పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలుస్తారన్నది అంచనాలకు అందడం లేదు.
రసవత్తర పోరు..
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే రెండు జట్లు మంచి ఊపుమీదున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి రెండింటిలో ఓటమి పాలయింది. పంజాబ్ కింగ్స్ కూడా ఆరు మ్యాచ్ లు ఆడి రెండింటిలో ఓడి ఎనిమిది పాయింట్లతో సమానంగా ఉంది. దీంతో ఇరుజట్లు పోరు నేడు రసవత్తరంగా మారనుంది. సొంత మైదానంలో ఆడుతుండటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొంత అనుకూలంగా ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Next Story

