Fri Dec 05 2025 14:13:54 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు ఐపీఎల్ లో సూపర్ మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది

ఐపీఎల్ లో మ్యాచ్ లు సగం ముగిశాయి. ఇంకా కొనసాగాల్సి ఉన్నప్పటికీ పది జట్లలో తొలి నాలుగు స్థానాల కోసం ఇప్పుడు రేసు ప్రారంభమయింది. ఇక మీదట జరిగే ప్రతి మ్యాచ్ కీలకమే. ఎందుకంటే ఇప్పటి నుంచి జరిగే మ్యాచ్ లలో గెలుపోటములే ప్లేఆఫ్ కు వెళతాయా? లేదా? అన్నది నిర్ణయిస్తాయి. అందుకోసమే ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తమ స్థానాలను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తాయి. మిగిలిన జట్లు కూడా వాటిని అధిగమించి ముందుకు రావడానికి శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తాయి.
కొనసాగాలంటే...?
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. కోల్ కత్తా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు జరుగుతుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లు గెలిచింది. అంటే పది పాయింట్లతో రేసులోనే ఉంది. కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే పంజాబ్ కింగ్స్ ఓటమి పాలయింది. ఇక కోల్ కత్తా నైట్ రైడర్స్ విషయానికి వస్తే ఎనిమిది మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. అంటే ఐదు మ్యాచ్ లలో ఓడింది. ఆరు పాయింట్లతో ఉంది. దీంతో నేడు జరిగే మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ కన్నా పంజాబ్ కింగ్స్ కు విజయం సాధించడం అవసరం.
Next Story

