Fri Dec 05 2025 15:54:18 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు మరో సూపర్ మ్యాచ్
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ కాపిటల్స్ ఢీకొంటుంది

ఐపీఎల్ లో మ్యాచ్ లు అన్నీ మజా తెచ్చి పెడుతున్నాయి. క్రికెట్ అభిమానులకు కావాల్సినంత పండగ. అయితే గత కాలంగా కొన్ని జట్లు మాత్రమే రాణిస్తుండగా మరికొన్ని జట్లు మాత్రం ఇంకా అపజయాల నుంచి కోలుకోలేదు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో పాయింట్లు పెరిగిపోతున్నాయి. పదహారు పాయింట్లు వచ్చిన జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి. నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశముండటంతో అన్ని జట్లు ఇంకా శ్రమిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని జట్లకు ప్లే ఆఫ్ల ఆశలు సన్నగిల్లాయి.
లక్నో వేదికగా...
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ కాపిటల్స్ ఢీకొంటుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు బలాబలాలను పరిశీలిస్తే మాత్రం ఢిల్లీదే పై చేయిగా కనిపిస్తున్నప్పటికీ ఐపీఎల్ లో ఏదైనా జరగొచ్చు. ఢిల్లీ కాపిటల్స్ ఇప్పటి వరకూ
ఏడు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచి రెండింటిలో ఓడింది. పది పాయింట్లతో ఉంది. లక్నో సూపర్ జెయింట్్ ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచి మూడింటిలో ఓడిపోయి పది పాయింట్లతో ఉంది. దీంతో ఇరు జట్లు సమ ఉజ్జీలుగానే ఉండటంతో నేటి పోటీ ఆసక్తికరంగా మారనుంది.
Next Story

