Sat Dec 13 2025 22:43:26 GMT+0000 (Coordinated Universal Time)
Amol Majumdar : ఏమిచ్చి రుణం తీర్చుకోము.. దేశం మీ ముందు మోకరిల్లడం తప్ప
మహిళల భారత జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలవడానికి ప్రధాన పాత్ర పోషించిన అమోల్ మజుందార్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి

మహిళల భారత జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలవడానికి ప్రధాన పాత్ర పోషించిన అమోల్ మజుందార్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండేళ్ల కాలంలో జట్టును ప్రపంచ ఛాంపియన్ గా నిలిపిన అమోల్ మజుందార్ కు కెప్టెన్ పాదాభివందనం చేసి తన గురు భక్తిని చాటుకుంది. నిజమైన గురువుగా అమోల్ మజుందార్ నిలిచారని చెప్పాలి. తనకున్న అనుభవాన్ని యువతులకు చెప్పి, వారిని తీర్చిదిద్దిన అమోల్ మజుందార్ కు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటూ యావత్ భారతదేశం ఆయన వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తుంది.
మంచి క్రికెటర్ గా....
నిజానికి అమోల్ మజుందార్ మంచి క్రికెటర్. ఎంతగా అంటే.. సచిన్ టెండూల్కర్ గురువ రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన ఆయన దేశవాళీ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేశారు. అయితే జాతీయ జట్టులో స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు. ముంబయి కు కెప్టెన్ గా వ్యవహరించిన అమోల్ మజుందార్ తాను గురువు వద్ద నేర్చుకున్న పాఠాలను భారత మహిళ జట్టు సభ్యులకు తెలపాలని నిర్ణయించుకున్నాడు. 2023లో నే మహిళ జట్టుకు అమోల్ మజుందార్ హెడ్ కోచ్ గా బాధ్యతలను చేపట్టారు.
ఓటములతో నిస్తేజంగా ఉన్న...
అప్పటి వరకూ వరస ఓటములతో నిస్తేజంగా ఉన్న భారత జట్టులో స్ఫూర్తిని నింపారు అమోల్ మజుందార్. బ్యాటింగ్, బౌలింగ్ లో మరిన్ని మెళుకువలను నేర్పాడు. జట్టులో ఉన్న ప్రతి సభ్యురాలిని మైదానంలో మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమించారు. ఆయన కష్టం ఊరికే పోలేదు. అందుకే హర్మన్ ప్రీత్ తన గురువు అమోల్ మజుందార్ కు ఛాంపియన్ గా నిలిచిన అనంతరం పాదాభివందనం చేసి కన్నీటి పర్యంతమయింది. ఏ గురువుకైనా ఇంతకంటే గురుదక్షిణ ఏమి కావాలి? అందుకే తల్లీ.. తండ్రి ఆ స్థానం ఎప్పటికీ నిజంగా గురువుదేనని మరొకసారి రుజువయింది.
Next Story

