Tue Oct 03 2023 06:48:48 GMT+0000 (Coordinated Universal Time)
మరో మినీ పోరు
ఆసియా కప్ ను గెలుచుకున్న భారత్ మరో మినీ పోరుకు సిద్ధమయింది. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో భారత్ సొంతగడ్డలో తలపడనుంది.

ఆసియా కప్ ను గెలుచుకున్న భారత్ మరో మినీ సమరానికి సిద్ధమయింది. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో భారత్ సొంతగడ్డలో తలపడనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఆడనున్న భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి రెండు వన్డే మ్యాచ్లకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కొహ్లి, హార్దిక్ పాండ్యాలు అందుబాటులో ఉండరు.
22న తొలి వన్డే...
ఈ నెల 22వ తేదీన తొలి వన్డే మ్యాచ్ ఆస్ట్రేలియాతో మొహాలీలో జరగనుంది. రెండో మ్యాచ్ సెప్టంబరు 24న ఇండోర్ లో జరగనుంది. మూడో మ్యాచ్ రాజ్కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కు కే ఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. వైెఎస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, వాష్టింగన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Next Story