Sat Dec 13 2025 22:35:17 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa : అయిపోయిందయ్యా.. ఇది కూడా ఓడినట్లేనా?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా కష్టాలు పడుతుంది

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా కష్టాలు పడుతుంది. దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. దక్షిణాఫ్రికా ముందు భారత బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సొంత గడ్డపైన కూడా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దుస్థితికి భారత జట్టు చేకుంది. కనీసం ఫాలో ఆన్ కూడా అందుకోలేకుండా భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. పరాజయం తప్పని దిశగా భారత్ అడుగులు పడుతున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ లో భారత్ ఓటమి నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అది కూడా ఒక్క శాతం మాత్రమే కనిపిస్తున్నాయి.
భారీ లక్ష్యంతో ...
ఇప్పటికే దక్షిణాఫ్రికా 288 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను మొదటుపెట్టింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా దక్షిణాఫ్రికా ఇరవై ఆరు పరుగులు చేసింది. భారత్ మాత్రం మొదటి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆల్ అవుట్ అయింది. యశస్వి జైశ్వాల్ ఒక్కడే యాభై ఎనిమిది పరుగులు చేసి పరవాలేదనిపించాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ నలభై ఎనిమిది పరుగులు చేసి ఓకే అని పించుకున్నాడు. ఇక మిగిలిన బ్యాటర్లందరూ వరస పెట్టి అవుటయి దక్షిణాఫ్రికా చేతికి విజయాన్ని చేరువలోకి తీసుకెళ్లారు.
వరసబెట్టి అవుటయి...
కెఎల్ రాహుల్ ఇరవై రెండు, సాయి సుదర్శన్ పదిహేను, ధ్రువ్ జురెల్ డకౌట్ తో వెనుదిరిగారు. రిషబ్ పంత్ ఏడు పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి పది పరుగులు, రవీంద్ర జడేజా ఆరు పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నారు. కులదీప్ యాదవ్ సహకారంతో నే వాషింగ్టన్ సుందర్ 48 పరుగుల చేయయగలిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ ఆరు వికెట్లు తీశాడు. సీమన్ హర్మర్ మూడు వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్ ఒకటి తీయడంతో భారత్ పని అయిపోయింది. జట్టు కోచ్ తో పాటు సభ్యులను కూడా మార్చాలన్న డిమాండ్ క్రికెట్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. మరి భారత్ ఈ మ్యాచ్ లో నాలుగో రోజు, ఐదో రోజు నిలబడి ఆడితే డ్రాగా ముగిసే అవకాశం మాత్రం కొంత కనిపిస్తుంది.
Next Story

