Thu Feb 26 2026 11:11:10 GMT+0530 (India Standard Time)
India vs Zimbabwe T20 World Cup : నేడు భారత్ - జింబాబ్వే మ్యాచ్
భారత్ - జింబాబ్వే మధ్య మ్యాచ్ నేడు చెన్నై వేదికగా జరగనుంది

టీ 20 వరల్డ్ కప్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ - జింబాబ్వే మధ్య మ్యాచ్ నేడు చెన్నై వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపు రెండు జట్లకు అవసరం. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలిచి తీరాలి. అందుకే శాయశక్తులా ఇరు జట్లు పోరాడుతుంటాయి. ఇరు జట్లలో కొన్ని బలహీనతలున్నాయి. కొన్ని బలాలున్నాయి. అంత మాత్రాన గెలుపు ఎవరిదన్నది మాత్రం అంచనా వేయడం కష్టమేనని అందరూ అంగీకరించే మాట. ఇండియా టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు వెళ్లాలంటే చాలా జరగాల్సి ఉంటుంది. అయితే నేటి చైన్నై మ్యాచ్ లో కొన్ని మార్పులు, చేర్పులతో టీం ఇండియా బరిలోకి దిగే అవకాశాలున్నాయంటున్నారు.
రెండు మ్యాచ్ లు గెలిచి...
టీం ఇండియా రెండు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. జింబాబ్వేపై దక్షిణాఫ్రికా మంచి రన్ రేట్ తో విజయం సాధించడంతో చెన్నైలోనూ భారీ స్కోరు చేసి భారత్ జింబాబ్వే పై గెలిచి తీరాలి. దక్షిణాఫ్రికా చేతిలో టీం ఇండియా ఓటమితో ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నట్లయింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికాలు కూడా మంచి సక్సెస్ రేటుతో టీ20 వరల్డ్ కప్ లో అడుగుపెట్టాయి. జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. దక్షిణాఫ్రికా మొన్నటి జింబాబ్వే మ్యాచ్ లో దంచి కొట్టింది. అందుకే టీం ఇండియాకు అంత సులువు కాదు. కానీ గెలవకపోతే ఆతిథ్య దేశం సెమీస్ కు చేరుకోకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది. అందుకే ఈ మ్యాచ్ జింబాబ్వే కంటే భారత్ కు అత్యంత కీలకం. ముఖ్యం కూడా.
బలహీనమైన బ్యాటింగ్ తో...
గత కొన్నిరోజులుగా టీం ఇండియా పేలవమైన ప్రదర్శన చూపుతుంది. టాప్ ఆర్డర్ మొత్తం వైఫల్యం కావడంత టీం ఇండియాకు ఇబ్బందికరంగా మారింది. బౌలింగ్ పరంగా కొంత బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ విషయంలోనే భయపడాల్సి వస్తుంది. అభిషేక్ శర్మ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇషాన్ కిషన్ ను ఊహించుకున్నంత ఆటను చూపించలేకపోతున్నాడు. తిలక్ వర్మ కూడా ప్లాప్ అవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అంతే. హార్ధిక్ పాండ్యా అయితే సక్సెస్ అయితే ఓకే.. లేకుంటే తక్కువ పరుగులకే అవుట్. రింకూ సింగ్ కూడా పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపడం లేదు. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం పేలవంగా ఉండటమే టీం ఇండియా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న అంశం. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story

