Sat Mar 28 2026 11:18:08 GMT+0530 (India Standard Time)
IPl : సిక్సర్లు.. ఫోర్లు.. అద్భుతమైన క్యాచ్ లు...నిజమైన ఫీస్ట్
ఐపీఎల్ సీజన్ నేడు ప్రారంభం కానుంది

ఐపీఎల్ సీజన్ నేడు ప్రారంభం కానుంది. నేడు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలోతొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. నేడు ప్రారంభమయ్యే మ్యాచ్ లు రెండు నెలల పాటు సాగనున్నాయి. సిక్సర్లు, ఫోర్లు, అద్భుతమైన క్యాచ్ లు, అలరించే షాట్లతో దేశం నలుమూలల ఉన్న స్టేడియంలు మారుమోగనున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు నెలల పాటు ఇక పండగే. ఒక రకంగా చెప్పాలంటే వేసవి కాలంలో నిజమైన ఫీస్ట్ ఈ ఐపీఎల్ ద్వారానే సాధ్యమవుతుంది.
తొలి మ్యాచ్...
అయితే ఈసారి బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచి బెంగళూరుకు వచ్చిన సందర్భంగా తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రారంభ వేడుకలను రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. తొలుత ఇరవై మ్యాచ్ షెడ్యూల్ ను ప్రకటించిన బీసీసీఐ తర్వాత రెండో విడత షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. రెండో విడతలో యాభై మ్యాచ్ లకుసంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 28వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకూ మొత్తం 70 మ్యాచ్ లు జరుగుతాయి.
మీ ఆట కోసం.. నిలువెల్ల కనులై...
ఐపీఎల్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇరవై ఓవర్ల ఈ మ్యాచ్ లలో దిగ్గజ క్రికెటర్లను తమ అభిమానులు చూసే అవకాశముంటుంది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడుతుండగా, విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు. రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలా తమ అభిమాన ఆటగాళ్లను టీ20లలో చూసే అవకాశం ఒక్క ఐపీఎల్ లోనే సాధ్యమవుతుంది. ఈ ఫార్మాట్లకు దిగ్గజ ఆటగాళ్లు గుడ్ బై చెప్పడంతో వారిని చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలి వస్తారు. ఇక టీవీల్లో వీక్షించేవారు కూడా వీరి రాక కోసం ఎదురు చూస్తున్నారు.
Next Story

