Sat Dec 13 2025 22:43:22 GMT+0000 (Coordinated Universal Time)
MS Dhoni : మహేంద్రుడి నిర్ణయానికి వేళయిందా?
క్రికెట్ ఫ్యాన్స్ కు డీలాపడే న్యూస్. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి

క్రికెట్ ఫ్యాన్స్ కు డీలాపడే న్యూస్. మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు వింటే చాలు ఎందరికో గూస్ బంప్స్ వస్తాయనడంలో సందేహం లేదు. అలాంటి ధోని ఇప్పటి వరకూ ఐపీఎల్ లో కనపడుతున్నాడు. పసుపు జెర్సీ వేసుకుని ధోని ఏ డౌన్ లో వచ్చినా స్టేడియం మొత్తం డీజే సౌండ్ కు మించి దద్దరిల్లిపోతుంది. ధోనిపై అభిమానం చెక్కు చెదరలేదనడానికి ఇది ఉదాహరణ మాత్రమే. ధోని బ్యాట్ పట్టుకుని వస్తే చాలు చూడాలని పరితపించే వారందెరో. ధోని కోసమే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులుగా లక్షలాది మంది మారిపోయారన్నది కూడా అంతే నిజం.
ఇక ఐపీఎల్ లో కనిపించరా?
అదే సమయంలో ధోని ఐపీఎల్ లోనూ ఇక కనిపించకపోవచ్చు. నాలుగు పదులు దాటిన వయసులో ధోనీ ఆడాలన్నా మనసు అంగీకరించకపోవచ్చు. అందుకే ధోనీకి ఇదే ఐపీఎల్ చివరి సీజన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్ననే ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించాల్సి ఉంది. కానీ వచ్చే ఐపీఎల్ లో ఆడేసి ఇక రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ధోనీ వయసు 44 సంవత్సరాలు కావడంతో ఈ సీజన్ తో ఆడతాడా? అన్న అనుమానాలు కూడా అనేక వార్తల కారణంగా బలపడుతున్నాయి. బహుశ ఈ ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే తరుపున ధోనీ పసుపు జెర్సీ ధరిస్తాడా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది.
సంజూ శాంసన్ ను...
ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటుందన్న వార్తలు ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తున్నాయి. సంజూ శాంసన్ కూడా బ్యాటర్, వికెట్ కీపర్ కావడంతో ధోనీ స్థానాన్ని పూరించగలరన్న నమ్మకంతో సీఎస్కే యాజమాన్యం సంజూ శాంసన్ ను తమ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న వార్తలు ధోనీ ఇక ఐపీఎల్ లోనూ కనిపించడన్న అనుమానానికి కారణంగా చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ ను సీఎస్కే తీసుకుంటే ధోనీ నిష్క్రమణ గ్యారంటీ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది ధోనీ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చే అవకాశముందంటున్నారు.
Next Story

