Sat Feb 28 2026 12:36:37 GMT+0530 (India Standard Time)
India vs West Indies : గెలిచి తీరాల్సిందే.. దూకుడు, ప్రయోగాలకు ఇది సమయం కాదు మిత్రమా?
భారత్ - వెస్టిండీస్ మ్యాచ్ రేపు కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది

భారత్ - వెస్టిండీస్ మ్యాచ్ రేపు కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకోవాలంటే ఖచ్చితంగా వెస్టిండీస్ పై గెలిచి తీరాల్సిందే. జింబాబ్వేపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. అయితే బౌలింగ్ లో సరైన ప్రదర్శన చేయకపోవడంతో రన్ రేట్ సాధించలేకపోయింది. వానపడి మ్యాచ్ చెరొక పాయింట్ వచ్చినప్పటికీ టీం ఇండియాకు ఉపయోగం లేదు. అది వెస్టిండీస్ కు మాత్రమే లాభిస్తుంది. అర్ష్ దీప్ సింగ్ ఒక్కరే పొదుపుగా బౌలింగ్ చేయగలిగారు. మిగిలిన బౌలర్లు అత్యధిక పరుగులు సమర్పించుకున్నారు. 256 పరుగులు చేసిన టీం ఇండియా 148 పరుగులకు జింబాబ్వేను అవుట్ చేసి ఉంటే రన్ రేట్ మెరుగ్గా ఉండేది.
ఆషామాషీ కాదు...
అందుకే మార్చి ఒకటో తేదీన కోల్‌కతాలో తలపడే మ్యాచ్ అత్యంత కీలకం. వెస్టిండీస్ పై గెలిచి తీరాల్సిందే. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఒకరకంగా టీం ఇండియాకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిదని చెప్పాలి. జింబాబ్వే గెలిచి కొంత ఆశలు సజీవంగా నిలుపుకున్నప్పటీకీ వెస్టిండీస్ పై సమరం ఆషామాషీ కాదు. . బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తే ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ గెలుపు ఖాయమవుతుంది. అనవసర ప్రయోగాలకు పోవడం కూడా అంత మంచిది కాదు. ఈ మ్యాచ్ 2016 టీ20 వరల్డ్ కప్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ఆ నాడు ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్లో వెస్టిండీస్ జట్టు భారత్‌ను ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపింది.
ఫామ్ లోకి వచ్చినా...
నాడు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే వెస్టిండీస్‌ను ఓడించి, పాత బాకీ తీర్చుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. అయితే వెస్టిండీస్ జట్టు కూడా మంచి ఫామ్ లో ఉంది. ఇటు భారత్, అటు వెస్టిండీస్ జట్లు సౌతాఫ్రికా మీద ఓడిపోయాయి. జింబాబ్వే మీద విజయం సాధించాయి. సమఉజ్జీలు అని చెప్పలేం కానీ, వెస్టిండీస్ లో హెట్ మేయర్ వంటి వారు చెలరేగి ఆడుతున్నారు. అలాగే బౌలింగ్ కూడా పకడ్బందీగానే ఉంది. అందుకే ఈసారి జట్టులో కులదీప్ యాదవ్ ను తీసుకునే అవకాశముందని అంటున్నారు. అయితే బ్యాటర్లలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలు ఫామ్ లోకి రావడం కొంత ఊరట కలిగించే అంశమే అయినా.. భారత అభిమానుల్లో మాత్రం సండే టెన్షన్ మాత్రం బాగా కనిపిస్తుంది.
Next Story

