Fri Dec 19 2025 05:55:54 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్
నేడు భారత్ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది.

నేడు భారత్ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లక్నో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు కావడంతో నేడు జరగనున్న మ్యాచ్ కీలకంగా మారనుంది. సిరీస్ ను ఈ మ్యాచ్ డిసైడ్ చేయనుంది. ఇప్పటికే భారత్ 2-1 సిరీస్ పై ఆధిక్యతను కొనసాగిస్తుంది. మొత్తం ఐదు మ్యాచ్ లు జరగాల్సి ఉండగా ఒక మ్యాచ్ రద్దు కావడంతో ఇదే చివరి మ్యాచ్ కావడంతో సిరీస్ ఎవరిదన్నది తేలనుంది.
స్వల్ప మార్పులతో...
ఈ మ్యాచ్ లో ఇరు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగనున్నాయి. అయితే లక్నో తరహాలోనే ఈ మ్యాచ్ కూడా ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతుండటంతో పొగమంచు ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన క్రికెట్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే వాతావరణ శాఖ మాత్రం పొగమంచు ఉండే అవకాశం లేదని చెబుతుంది. రెండు జట్లు ఈ మ్యాచ్ లో విజయం కోసం శ్రమిస్తున్నాయి.
Next Story

