Sat Dec 13 2025 22:43:23 GMT+0000 (Coordinated Universal Time)
India Vs South Africa : ప్రపంచ ఛాంపియన్ ఫైనల్ కు చేరుకోవాలంటే?
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. కోల్ కత్తా వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ సిరీస్ రెండు జట్లకు కీలకం. ఈ సిరీస్ లో గెలిస్తే ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇటు రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్ లో ప్రాక్టీస్ నుమ ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు శ్రమిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే భారత్ కు సొంత గడ్డ కావడం కొంత కలసి వచ్చే అంశమని చెప్పక తప్పదు. సొంతగడ్డపై ప్రత్యర్థిని మట్టికరిపించాలన్న ఉద్దేశ్యంతో భారత్ ఉంది.
జట్టు పటిష్టంగానే...
అదే సమయంలో భారత్ జట్టు పటిష్టంగానే ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ ను కోల్పోయిన నేపథ్యంలో ఈ సిరీస్ భారత్ కు మరింత ముఖ్యంగా కనిపిస్తుంది. ఈ సిరీస్ ను సాధిస్తే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపడే ఛాన్సు ఉండటంతో భారత్ అమితుమీ తేల్చుకోవడానికే సిద్ధమవుతుంది. అందుకే ఈ సిరీస్ పై భారత్ కన్నేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో తప్పొప్పులను సరిదిద్దుకుని ఈ సిరీస్ ను సొంతం చేసుకోవాలని టీం ఇండియా ఉవ్విళ్లూరుతుంది.
పంత్ రావడంతో...
ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అందుబాటులోకి వస్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన రిషబ్ పంత్ కోలుకుని జట్టులో చేరడంతో పంత్ స్థానంలో ఎవరిని తొలగిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మరొక వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ వైపు అందరి వేళ్లు చూపుతున్నప్పటికీ ధ్రువ్ జురెల్ సూపర్ ఫామ్ లో ఉండటంతో అతనిని జట్టు నుంచి తొలగించడం కష్టమేనని అంటున్నారు. రిషబ్ పంత్ స్థానంలో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. మరొకవైపు ఆస్ట్రేలియా పర్యటనలో సాయి సుదర్శన్ కూడా పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపలేదని, అతనిపై కూడా వేటు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద భారత జట్టు స్వల్ప మార్పులతోనే రేపు ఈడెన్ గార్డెన్స్ లో దిగనుంది.
Next Story

