Wed Jan 21 2026 04:23:13 GMT+0000 (Coordinated Universal Time)
India vs Newzealand : నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి టీ20
భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు తొలి టీ20 జరగనుంది.

భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు తొలి టీ20 జరగనుంది. నాగపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి ఏడుగంటలకు ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టీ20 మ్యాచ్ లు భారత్ న్యూజిలాండ్ తో సొంతగడ్డపై ఆడనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను చేజిక్కించుకున్న ఉత్సాహంతో ఉన్న కివీస్ అదే దూకుడును ప్రదర్శించాలని భావిస్తుంది. వన్డే సిరీస్ కోల్పోయినా టీ20 సిరీస్ ను చేజిక్కించుకుని ప్రపంచ ఛాంపియన్ ముద్ర చెరిపేసుకోకుండా ఉండాలని భారత్ ప్రయత్నిస్తుంది. ఇరు జట్లు టీ20లలో బలంగానే ఉన్నాయి.
ఎవరిది పైచేయి అంటే...?
సమఉజ్జీల పోరులో ఎవరిది పై చేయి అన్నది ముందుగా అంచనా వేయడం కష్టం. టీ20 లలో భారత్ కు మెరుగైన రికార్డులున్నాయి. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ ఛాంపియన్ షిప్ జరగనుండటంతో ఈ మ్యాచ్ లన్నీ ప్రిపరేషన్ మ్యాచ్ లుగానే ఇరు జట్లు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ భారత్ - న్యూజిలాండ్ ల మధ్య మొత్తం 25 టీ 20 మ్యాచ్ లు జరిగితే అందులో పన్నెండు భారత్, పన్నెండు న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచ్ లో మాత్రం ఫలితం తేలలేదు. అంటే ఇరు జట్లు మంచి పెర్ ఫార్మెన్స్ లో ఉన్నట్లే కనపడుతుంది.
బలాబలాలు సమానంగానే...
చివరిగా భారత్ - న్యూజిలాండ్ మధ్య 2023లో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ కూడా టీ20 మ్యాచ్ లలో తిరుగులేని టీం గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అందరూ ఫుల్లు ఫామ్ లో ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా ఎంట్రీ ఇస్తున్నారు. ఇకతొలి మ్యాచ్ నేడు నాగపూర్ లో జరుగుతుండగా, ఈ నెల 23వ తేదీన రాయపూర్ లో రెండో మ్యాచ్, మూడో మ్యాచ్ గౌహతిలో జనవరి 25వ తేదీన, నాలుగో మ్యాచ్ విశాఖపట్నంలో 28న, తిరువనంతపురంలో ఐదో మ్యాచ్ ఈ నెల 31వ తేదీన జరగనుంది. సో.. కనీసం టీ20 సిరీస్ నైనా భారత్ కైవసం చేసుకుంటుందని ఆశిద్దాం.
Next Story

