Sat Mar 28 2026 10:20:03 GMT+0530 (India Standard Time)
lPl 2026: నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు
నేటి నుంచి ఐపీఎల్ 19 వ సీజన్ ప్రారంభం కానుంది.

నేటి నుంచి ఐపీఎల్ 19 వ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం పది జట్లు తలపడుతున్నాయి. దాదాపు రెండు నెలల పాటు సాగనున్న ఐపీఎల్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి మజాను అందిస్తాయి. మొత్తం 74 మ్యాజ్ లు జరగనున్నాయి. నేటి నుంచి మే 24వ తేదీ వరకూ మ్యాచ్ లు జరగనున్నాయి.
74 మ్యాచ్ లతో...
అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ ఐపీఎస్ సీజన్ లో కనిపించనుండటంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ధోని, కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు కనువిందు చేయనున్నారు. ఈరోజు తొలి మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
Next Story

