Thu Jan 16 2025 21:53:27 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి సంక్రాంతికి కోనసీమలో వెరైటీగా పడవ పందేలు
ఈసారి సంక్రాంతికి కోనసీమలో పడవల పందేలు కూడా ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవ పోటీలు జరుగుతున్నాయి
సంక్రాంతి అంటే కోడిపందేలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేలతో పాటు జల్లికట్టు, బండ్లలాగుడు పందేలు కూడా అంతే స్థాయిలో జరుగుతాయి. కానీ ఈసారి కోనసీమలో కొంత విభిన్నంగా పోటీలు జరుగుతున్నాయి. కేరళలో పడవల పోటీలు ఓనం పండగకు ఎక్కువగా జరుగుతుంటాయి. దీనిని వీక్షించేందుకు ఎక్కువ మంది జనం హాజరవుతారు.
ఆత్రేయపురంలో...
కానీ ఈసారి కోనసీమలో పడవల పందేలు కూడా ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవ పోటీలు జరుగుతున్నాయి. కేరళ తరహాలో ఈ పోటీలను నిర్వహకులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు.
Next Story