Thu Jan 15 2026 13:55:39 GMT+0000 (Coordinated Universal Time)
Cockfight : అతిపెద్ద కోడిపందెం.. 1.53 కోట్లు పలికిన ధర
సంక్రాంతికి కోడిపందేలలో రికార్డు స్థాయి పందెం పలికింది.

సంక్రాంతికి కోడిపందేలలో రికార్డు స్థాయి పందెం పలికింది. ఇప్పటి వరకూ వేసిన పందేల్లో ఇదే అతిపెద్ద పందెం. ఒక కోడి పందెం 1.53 కోట్ల రూపాయలు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. అయితే తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేశ్ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
అయితే ఈ పందెంలో పందెం గెలిచి రూ.1.53 కోట్ల రూపాయలను రాజమండ్రి రమేశ్ సొంతం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొత్తంలో ఈ ఏడాది ఇదే అతి పెద్ద పందెం అని చెబుతున్న స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఇంత భారీ స్థాయిలో జిల్లాలో ఇంత భారీ స్థాయిలో కోడి పందెం జరగలేదని పందెం రాయుళ్లు చెబుతున్నారు.
Next Story

