Mon Feb 02 2026 18:28:59 GMT+0000 (Coordinated Universal Time)
బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత
అనారోగ్యం కారణంగా గత నెలరోజులుగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ బజాజ్ పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా..

బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్(83) కన్నుమూశారు. కొంతకాలంగా న్యూమోనియా, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యం కారణంగా గత నెలరోజులుగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ బజాజ్ పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి.. బజాజ్ గ్రూప్ చైర్మన్ అయ్యారు.
రాహుల్ బజాజ్ కు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు రాజీవ్ బజాజ్, సంజీవ్ బజాజ్, కూతురు సునైన ఉన్నారు. ఆయన భార్య రూప బజాజ్ 2013లోనే మరణించారు. కాగా.. రాహుల్ బజాజ్ పారిశ్రామిక వేత్తగా పద్మ భూషణ్ ను అందుకున్నారు. రాహుల్ బజాజ్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
Next Story

