Fri Dec 05 2025 06:21:07 GMT+0000 (Coordinated Universal Time)
పానీ పూరీ కోసం ఏడ్చింది.. రోడ్డెక్కింది
పానీ పూరీ తినడానికి వెళ్లిన మహిళకు పూరీలు తక్కువ ఇవ్వడంతో రోడ్డెక్కింది. గుజరాత్ రాష్ట్రం వడోదర నగరంలోని సూర్సాగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

పానీ పూరీ తినడానికి వెళ్లిన మహిళకు పూరీలు తక్కువ ఇవ్వడంతో రోడ్డెక్కింది. గుజరాత్ రాష్ట్రం వడోదర నగరంలోని సూర్సాగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఎప్పటిలా పానీపూరీ తినేందుకు వెళ్లింది. ఆమె ఇచ్చిన 20 రూపాయలు తీసుకొని, 4 పానీ పూరీలను ఇవ్వడంతో ఆమెకు కోపం వచ్చింది. ఒక ప్లేటుకు 6 ఇవ్వాలని కోరింది. సరకుల ధరలు పెరిగాయని, అందుకే తగ్గించానని వ్యాపారి చెప్పడంతో ఆమె బిగ్గరగా అరుస్తూ, రద్దీగా ఉండే రోడ్డు మధ్యకు వెళ్లి ఏడుస్తూ కూర్చొంది. అయితే పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో శాంతించింది.
Next Story

