Thu Dec 18 2025 07:31:35 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు, లోకేష్ కు కొడాలి నాని సవాల్
చంద్రబాబు, లోకేష్‌ను తరిమికొట్టి, ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని.. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో..

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఆదివారం గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో ఆయన.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరుతో ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యాడని అన్నారు.
ఒకప్పుడు ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ను తరిమికొట్టి, ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని.. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఓటమి తప్పదని నాని జోష్యం చెప్పారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా..? ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అని మండిపడ్డారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీఛ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Next Story

