Thu Jan 23 2025 10:26:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బీజేపీకి షాక్.. రావెల్ కిశోర్ రాజీనామా
ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి..
![ఏపీలో బీజేపీకి షాక్.. రావెల్ కిశోర్ రాజీనామా ఏపీలో బీజేపీకి షాక్.. రావెల్ కిశోర్ రాజీనామా](https://www.telugupost.com/h-upload/2022/05/16/1361189-ravela-kishore.webp)
ఏపీలో ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని చూస్తున్న బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు కిశోర్ బాబు తెలిపారు.
కాగా.. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి.. తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే కదా అని చంద్రబాబు ఆయనను పక్కన పెట్టలేదు. మంత్రి పదవిని కట్టబెట్టి.. సముచిత స్థానాన్ని కల్పించారు. ఆ తర్వాత పలు కారణాలతో మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు టిడిపిని వీడి.. జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు కానీ.. ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే రావెల కిశోర్ మళ్లీ టిడిపిలో చేరుతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story