Tue Jan 14 2025 20:40:06 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ సీఎంపై డీజీపీకి ఫిర్యాదు.. మద్యంమత్తులో..
శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా భగవంత్ మాన్ పై ఇవే ఆరోపణలు చేసింది. ఈ నెల 14న వైశాఖి సందర్భంగా
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై శనివారం డీజీపీకిి ఫిర్యాదు అందింది. మద్యంమత్తులో భగవంత్ మాన్ గురుద్వారాలోకి ప్రవేశించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ యువనేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా నేరుగా పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భగవంత్ మాన్ పై తానుు పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రతులను బగ్గా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
కాగా ..శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా భగవంత్ మాన్ పై ఇవే ఆరోపణలు చేసింది. ఈ నెల 14న వైశాఖి సందర్భంగా తాగిన మత్తు ఇంకా దిగకుండానే గురుద్వారాలోకి ప్రవేశించారంటూ శుక్రవారం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి భగవంత్ మాన్ క్షమాపణ చెప్పాలని ఎస్జీపీజీ డిమాండ్ చేసింది. భగవంత్ మాన్ పై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story