Fri Jan 24 2025 17:29:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో పార్టీ.. జొన్నవిత్తుల ప్రకటన
రాష్ట్రంలో నాయకులు, ప్రజలను చైతన్య వంతుల్ని చేసేందుకే పార్టీ పెడుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగు భాషకు పునర్వైభవం..
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించనుంది. ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలుగు భాష, పరిరక్షణ కోసం పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. పార్టీ పేరు జై తెలుగు పార్టీ అని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. మన సంస్కృతిని, భాషను మనమే కాపాడుకోవాలని జొన్నవిత్తుల ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్రంలో నాయకులు, ప్రజలను చైతన్య వంతుల్ని చేసేందుకే పార్టీ పెడుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగు భాషకు పునర్వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని చెప్పారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా తెలిపారు. జొన్నవిత్తుల పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ- జనసేన ఒక కూటమిగా వస్తాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు వారాహి యాత్రలో ఉన్న పవన్.. ఈసారి తనను సీఎంను చేస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఇప్పుడు జొన్నవిత్తుల పార్టీ.. ఓ వర్గానికి చెందిన ప్రజలపై ప్రభావం చూపుతుందా ? ఈ పార్టీ ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తుందా ? అని చర్చించుకుంటున్నారు.
Next Story