Sun Dec 08 2024 10:23:22 GMT+0000 (Coordinated Universal Time)
ఖలేజా లేదా? కన్ఫ్యూజన్ లో ఉన్నారా?
చంద్రబాబు జైలుకు వెళ్లి ఇరవై రోజులకు పైగానే అవుతుంది. ఆయన గైర్హాజరీలో పార్టీ ఎలా ఉంటుందన్నది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లి ఇరవై రోజులకు పైగానే అవుతుంది. ఆయన గైర్హాజరీలో పార్టీ ఎలా ఉంటుందన్నది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన గత నాలుగున్నరేళ్లుగా పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ క్యాడర్ ను, లీడర్లను కార్మోన్ముఖులను చేస్తున్నారు. అయితే గత ఇరవై రోజుల నుంచి పార్టీ పరిస్థితి ఏంటంటే సులువుగానే అర్థమయిపోతుంది. టీడీపీని చంద్రబాబు మినహా మరెవర్వూ లీడ్ చేసే నేతలే కన్పించడం లేదు. అసలు కార్యాచరణను రూపొందించడంలోనూ నేతలు సక్సెస్ కాలేకపోయారు.
క్యాడర్ మొత్తాన్ని…
పార్టీ అధినేత జైలులో పెడితే ఎలా ఉండాలి. క్యాడర్ మొత్తాన్ని గ్రౌండ్ లోకి దించగలగాలి. ఇక లీడర్ నే అరెస్ట్ చేసినప్పుడు ఇక మిగిలిన వాళ్లు ఆలోచించాల్సిన పనేముంది? సత్తా చూపించాల్సిన సమయంలో టీడీపీ నేతలు చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. ప్రజలు ప్లేట్లు మోగించమంటూ పిలుపు నివ్వడం మినహా సో కాల్డ్ లీడర్లు ఈ ఇరవై రోజుల నుంచి రూపొందించిన కార్యాచరణ ఏంటో కింది స్థాయి కార్యకర్తలకు అర్తం కావడం లేదు. అక్టోబరు 2వ తేదీన ఏదో కార్యక్రమాలు ప్రకటించి మమ అనిపించారు తప్పించి సాలిడ్ గా కార్యక్రమాలను రూపొందించడంలో టీడీపీ నాయకత్వం విఫలమయిందంటున్నారు.
గ్రామస్థాయిలో…
టీడీపీ తక్కువ పార్టీ కాదు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఏపీలో వేళ్లూనుకున్న పార్టీ. గ్రామ గ్రామాన పటిష్టమైన క్యాడర్ ఉంది. కరడు గట్టిన పార్టీ కార్యకర్తలు దాని సొంతం. సైకిల్ అంటే తెలియని పల్లెటూరు కూడా లేని రాష్ట్రంలో పార్టీ అధినేత అరెస్ట్ అయితే కార్యక్రమాలు ఇలాగా చేసేది? అన్న కామెంట్స్ ఆ పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. సమావేశాలు కావడం నేతలు పిచ్చి కార్యక్రమాలను రూపొందించడం ఈ ఇరవై రోజుల నుంచి జరుగుతుంది. చంద్రబాబు తీసుకునే ప్రతి కార్యక్రమం విన్నూత్నంగా సాగుతుంది. కానీ నేతలు మాత్రం అలాంటి కార్యక్రమాలను రూపొందించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు.
నేతలున్నా…
టీడీపీలో సామాన్యమైన నేతలున్నారా? అంటే కాదు. ఎందరో సీనియర్లు. తొలి నుంచి పార్టీలో ఉన్న నేతలున్నారు. చంద్రబాబుతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్న అనుభవం వారికి ఉంది. అన్ని సాామాజికవర్గాల్లో బలమైన నేతలే ఉన్నారు. కానీ తెగించి బయటకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ కు నిసనగగా పోరాడాల్సిన సమయంలో నాయకత్వాన్ని నీరు గారుస్తూ కంటితుడుపు కార్యక్రమాలు చేపడుతున్నారన్నది వాస్తవం. నాయకులు కనీసం ఒక్క మంచి కార్యక్రమాన్ని కూడా రూపొందించలేకపోయారు. లీడర్లలో ఖలేజా లేదా? కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అన్నది తెలియదు కాని గత ఇరవై రోజుల నుంచి పార్టీని ముందుకు నడపాలన్న ధ్యాస మాత్రం ఏ ఒక్కిరికీ లేదన్నది మాత్రం అర్థమయిపోయిది.
Next Story