Mon Dec 29 2025 22:15:15 GMT+0000 (Coordinated Universal Time)
తెదేపా రాజకీయాల్లోకి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్

ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ అంతాపక్కన పెట్టేసింది. కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చెయ్యడం లో కీలక పాత్ర వహించాడు. గతం లో కొన్నాళ్ళు ఎన్టీఆర్ తో బాలకృష్ణ దగ్గరనుండి పురందరేశ్వరి వరకు అందరూ బాగానే కలుపు గోలుగా ఉండేవారు. ఇదే ఊపులో గతం లో టిడిపి తరపున చంద్రబాబు నాయుడుకి సహాయం చేయడానికని ఎన్నికల్లో ప్రచారం కూడా చేసాడు ఎన్టీఆర్. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి గెలవలేదు. ఇక అప్పటినుండి కొంచెం చంద్రబాబు ఎన్టీఆర్ ని దూరం పెట్టడం ప్రారంభించాడు. ఇక ఎన్టీఆర్ పెళ్లికూడా చంద్రబాబు కి బాగా కావాల్సిన దగ్గరి చుట్టాల అమ్మాయితో పెళ్లి చేయించాడు. ఏమైందో ఏమో గత కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీ గాని చంద్రబాబు గాని ఎన్టీఆర్ ని అస్సలు దగ్గరికి రానివ్వడం లేదు. ఒక్క తన తండ్రి హరికృష్ణ తో, అన్న కళ్యాణ్ రామ్ తో తప్ప ఎన్టీఆర్ కి ఆ కుటుంభం తో అస్సలు సంబంధం లేకుండా పోయింది.
అసలు ఇలా జరగాడికి ఒక రకంగా కారణం మాత్రం చంద్రబాబే అని కొందరు అంటుంటారు. ఇలా ఎందుకనుకుంటున్నారంటే ఎన్టీఆర్ కి ఇటు సినిమాలో ఫాన్స్ ఫాలోయింగ్ చాల ఎక్కువ. ఇక తాతగారి నటన... మాట తీరు.... అందం పుణికి పుచ్చుకున్నాడు కాబట్టి ఇటు పొలిటికల్ గా కూడా ఎన్టీఆర్ కి మంచి క్రేజే వుంది. అందువల్ల ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ కారణం గా తన కొడుకు లోకేష్ ఎక్కడ తక్కువై పోతాడో అని ఎన్టీఆర్ ని తొక్కడం ప్రారంభించాడని టాక్. అందుకే బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ కి దూరామయ్యాడని అంటూ వుంటారు. ఎందుకంటే లోకేష్ బాలకృష్ణ కి అల్లుడు కాబట్టి. లోకేష్ కి అసలు సరైన మాటతీరు గాని మాస్ ఫాలోయింగ్ గాని లేక పోవడం తో ఎన్టీఆర్ ఎక్కడ లోకేష్ ని తలదన్నే నాయకుడిగా రాజకీయాలలో ఎదుగుతాడో అని భయపడి చంద్రబాబు ఇదంతా చేసాడనే ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అండ లేకుండానే ఎన్టీఆర్ మంచి నటుడిగా ఎదిగాడు. వరస హిట్స్ తో చెలరేగిపోతున్నాడు. అందుకే మళ్ళీ ఎన్టీఆర్ ని దగ్గర చేసుకోవడానికి బాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం మొదలైంది. 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ సేవలని ఉపయోగించుకోవాలని వ్యూహం పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయం లో పవన్ ఏకాకిగా జనసేన పార్టీ తో బరిలోకి దిగడానికి సిద్ధమవడం తో అతని పోటీ తట్టుకునేందుకు ఎన్టీఆర్ ని ఈ ఎన్నికల్లో దింపాలని భావిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ ని దువ్వడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు.
అయితే ఇంకోరకం గా వినబడుతున్న మాటేమిటంటే లోకేష్ ఎలాగూ మంత్రి పదవి దక్కి రాజకీయాల్లో పాతుకు పోతాడు. ఇక లోకేష్ ని కదిలించడం ఎవ్వరి తరం కాదు. అందుకే చంద్రబాబు భయపడకుండా ఎన్టీఆర్ ని లైన్ లోకి దింపాలని పావులు కదుపుతున్నట్టు సమాచారం. పాపం చూడండి ఎంతలా ఎన్టీఆర్ ని ఉపయోగించుకుని అవసరం తీరక అలా విసిరేస్తున్నారో అని ఎన్టీఆర్ అభిమానులు అప్పుడే ఫీల్ అవ్వడం మొదలెట్టారట.
Next Story

