వ్యూహకర్త అవసరమటగా
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వ్యూహకర్త అవసరమా? ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్టీ అంటున్న చంద్రబాబు స్ట్రాటజీలు వర్క్ అవుట్ కాకపోవడంతో పార్టీకి ఇప్పుడు ఒక వ్యూహకర్త అవసరమన్న అభిప్రాయం [more]
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వ్యూహకర్త అవసరమా? ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్టీ అంటున్న చంద్రబాబు స్ట్రాటజీలు వర్క్ అవుట్ కాకపోవడంతో పార్టీకి ఇప్పుడు ఒక వ్యూహకర్త అవసరమన్న అభిప్రాయం [more]

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వ్యూహకర్త అవసరమా? ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్టీ అంటున్న చంద్రబాబు స్ట్రాటజీలు వర్క్ అవుట్ కాకపోవడంతో పార్టీకి ఇప్పుడు ఒక వ్యూహకర్త అవసరమన్న అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలోనూ వ్యూహకర్త అంశంపై పలువురు సీనియర్ నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. చంద్రబాబునాయుడు కూడా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లలేరన్న అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తమవుతోంది.
యూ టర్న్ లతో…..
ముఖ్యంగా ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు తీసుకున్న స్టాండ్ కొంపముంచిందన్న భావన అందరిలోనూ ఉంది. ఒకసారి ప్రత్యేక హోదా వద్దనడం, ప్యాకేజీ ముద్దనడం, మళ్లీ ప్రత్యేక హోదా కావాలనడం… ఇలా యూటర్న్ లు తీసుకున్నందునే జనం చంద్రబాబును నమ్మలేదన్నది నిజమని సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. దీంతో పాటుగా దేశంలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీతో కటీఫ్ చెప్పేయడం కూడా ఇబ్బందికరపరిణామమేనని, ఇది చంద్రబాబు అనుసరించిన వ్యూహంలో లోపమని కొందరు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు.
బీజేపీతో ఘర్షణ వైఖరిని….
ఒకవేళ ఎన్డీఏ నుంచి తప్పుకున్నప్పటికీ హుందాగా ఉండకుండా పోరాట దీక్షల పేరుతో మోదీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం కూడా చంద్రబాబు తొందరపాటుతనానికి నిదర్శనమని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పడిన ట్రాప్ లో చంద్రబాబు పడ్డారన్న మోదీ వ్యాఖ్యలను కూడా కొందరు టీడీపీ నేతలు సమర్థిస్తున్నారు. జగన్ పార్టీ బీజేపీకి దగ్గరవుతుందన్న ఏకైక కారణంతో తాను దూరమై చంద్రబాబు తప్పుచేశారంటున్న వారు పార్టీలో ఎక్కువ మందే ఉన్నారు. ఇలా చంద్రబాబు వరస వ్యూహాలు బెడిసికొట్టాయి.
ఒంటరిగా పోటీ చేసి…..
ఇక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం చంద్రబాబు అతి విశ్వాసానికి కారణమంటున్నారు. పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మైలేజీ వచ్చేదంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుందని, వచ్చే ఎన్నికల నాటికి తమకు ఒక వ్యూహకర్త అవసరమని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. టిక్కెట్ల పంపిణీ విషయంలోనూ ప్రజల్లో బలం ఉన్న నేతలకే అవకాశం ఇచ్చేలా ఒక వ్యూహకర్తను నియమించాలని ఎక్కువ మంది కోరుతున్నారు.

