ఏపీ మంత్రుల్లో అత్యంత బద్ధకిస్టు ఈయనే

ఎపి క్యాబినెట్లో మంత్రులు మహా బద్దకస్తులుగా తయారయ్యారు.... వచ్చిన ఫైళ్లను క్లియర్ చెయ్యడంలో వారాలు నెలలు సమయం తీకుంటున్నారు... ఫైళ్లను క్లియర్ చేయడంలో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అందరిది ఒకటే తీరు...ఫైళ్ల క్రియరెన్స్ లో ఫస్ట్ ఉన్నది ఎవరు...లాస్ట్ వచ్చింది ఎవరు....జిఎడి రిపోర్టులు ఏమి చెపుతున్నాయ్?....వాచ్ దిస్ స్టోరీ
మంత్రులు సంతకం కోసం....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనను ఉరుకులు పెట్టించేందుకు సిఎం చంద్రబాబు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఎక్కవ సమయం పని చెయ్యడం ద్వారా లక్ష్యాలపై ఎప్పటికిప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంటారు. సిఎం ఎంత ఉరుకులు పెట్టించినా...కొందరు మంత్రులు మాత్రం తమ విధుల్లో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంక కీలకమైన నిర్ణయాలు, విధాన పరంగా చర్చించి అడుగు ముందుకు వెయ్యాల్సిన సమయంలోనే కాకుండా సాదారణ ఫైళ్ల విషయంలో కూడా రోజులువారాలు తినేస్తున్నారు. చాలా మంది మంత్రులు వారం పది రోజుల యావరేజ్ తో పనులు చేస్తున్నా కొందరు మాత్రం ఒక్కో ఫైల్ కు రెండు వారాల నుంచి రెండు మూడు నెలల సమయం తీసుకుంటున్నారు.గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది అనే అంశాలపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చింది. మంత్రుల వద్దకు ఫైల్ వెళ్లిన సమయం నుంచి అక్కడినుంచి అది బయటకు వచ్చిన సమయం వరకు లెక్కిస్తూ రిపొర్ట్ సిద్దం చేసింది. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఈ తరహా నివేదికలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అప్పటికే వివిధ సెక్షన్ల నుంచి అధికారులు నుంచి తిరిగి తిరిగి మంత్రుల వద్దకు వచ్చిన ఫైళ్లు ఇక్కడే వారాలు, నెలలు ఉండడంతో విధాన పరమైన నిర్ణయాల్లో జాప్యం జరుగుతుంది. ఎపి క్యాబినెట్ లో ఫైళ్ల క్లియరెన్స్ లో అత్యంత వెనుక బడింది ఎవరు అని లెక్కలు తీస్తే దేవాదాయ శాఖామంత్రి పేరు కనిపిస్తుంది. ఈయన పేషీకి ఫైల్ వెళితే అది బయటకు రావడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. జిఎడి ఇచ్చిన వివరాల ప్రకారం వివిధ నిర్ణయాలకు సంబంధించి 11 ఫైళ్లు సంతకం చేసి పంపడానికి నెలలకు నెలలు పట్టింది. మాణిక్యాల రావు ఫైళ్ల క్లియరెన్స్ యావరేజ్ 77 రోజులుగా ఉంది. అంటే ఒక్కో ఫైల్ క్లియర్ చెయ్యడానికి ఆయన తీసుకునే టైం రెండు నెలలు పైనే. పేషీ లో ఉన్న స్టాఫ్ సరిగా గైడ్ చెయ్యక పోవడం కూడా ఈ పెండింగ్ కు కారణం. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు పేషీల్లో కూడా ఫైళ్లు అంత వేగంగా కదలడం లేదు అని తెలుస్తోంది. గంటా దగ్గర ఒక్కొ ఫైల్ క్లియర్ అవ్వడానికి సరా సరి 33 రోజులు పడుతుంది.
చినరాజప్ప సూపర్....
నిత్యం రివ్యూలు, మీటింగ్ లు, పర్యటనలు, పార్టీ వ్యవహారలు ఉండే ముఖ్యమంత్రి కూడా 20 రోజుల యావరేజ్ తో తన ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. గత ఏడాది ఆయన 5280 ఫైళ్లను 20 రోజుల సరాసరితో నిర్ణయాలు తీసుకుని సంతకాలు చేశారు. ఇక పోతే దస్త్రాలను క్లియర్ చెయ్యడంలో డిప్యూటీ సిఎం చిన రాజప్ప ఫుల్ స్పీడ్ తో ఉన్నారు. రాజప్పకు ఫైల్ వస్తే మూడు రోజుల్లో వాటిని క్లియర్ చేస్తున్నారు. ఏడాది కాలంలో 364 ఫైళ్లను చిన రాజప్ప 3 రోజుల 22 గంటల 56 నిముషాల యావరేజ్ తో ముగించేశారు. ప్రస్తుత క్యాబినెట్లో అత్యంత వేగంగా ఫైళ్లు క్లియర్ చేసిన మంత్రిగా చిన రాజప్ప నిలిచారు. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా వారంలో కనీసం మూడు సార్లు సచివాలయానికి వచ్చే ఆయన ఫైళ్ల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమతో పాటు డిప్యూటీ సిఎం కెఈ కృష్ణ మూర్తి తమ ఫైళ్ల క్లియరెన్స్ కు సరా సరి 5 రోజుల సమయం తీసుకుంటున్నారు. రాజప్ప తరువాత తక్కువ టైంలో వీరు ఫైళ్ల పై సంతకాలు పెట్టేస్తున్నారు. పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావు, నారాయణ దస్రాలను పరిష్కరించడానికి రెండు వారాల సమయం తీసుకుంటున్నారు. సిఎం తరువాత ఎక్కువ ఫైళ్లు వచ్చే ఆర్థిక మంత్రి యనమల మాత్రం యావరేజ్ గా 8 రోజుల్లో ఫైళ్లును పంపేస్తున్నారు. యనమల వద్దకు ఏడాది కాలంలో 1510 ఫైళ్లు రాగా....ఆయన 8 రోజుల 18 గంటల 51 నిముషాల సరా సరితో ఫైళ్లను క్లియర్ చేశారు. సచివాలయంలో ఈ ఫైలింగ్ తరువాత గణనీయ మైన మార్పులు వచ్చాయి. ఎక్కడా ఫైల్ పెండింగ్ లో ఉందో అందరికీ తెలిసి పోతుంది. దీంతో ఉద్యోగులు, అధికారులు కొంత బాద్యతగా పని చేస్తున్నారు. మంత్రుల్లో కొందరు మాత్రం సంతకాలు చెయ్యడమంటే పెద్ద పని గా దాన్ని పక్కన పెడుతున్నారు.
మంత్రి పేరు ఫైళ్లు యావరేజ్ టైం
సిఎం చంద్రబాబు 5280 20 రోజుల 23 గంటల
యనమల రామకృష్ణుడు 1510 8 రోజుల 18 గంటల
నారాయణ 1268 11 రోజుల 15 గంటల
కేఈ కృష్ణమూర్తి 935 5 రోజుల 13 గంటలపుల్లారావు
దేవినేని ఉమ 740 5 రోజులు 18 గంటలు
శిద్దా రాఘవరావు 626 17 రోజుల 14 గంటలు
గంటా శ్రీనివాసరావు 554 33 రోజులు
అయ్యన్నపాత్రుడు 517 5 రోజుల 22 గంటలు
చిన రాజప్ప 364 3 రోజుల 22 గంటలు
అచ్చెన్నాయుడు 352 8 రోజుల 16 గంటలు
కొల్లు రవీంద్ర 333 13 రోజుల 21 గంటలు
కామినేని శ్రీనివాస్ 264 7 రోజులు
పరిటాల సునీత 61 16 రోజులు
మాణిక్యాల రావు 11 77 రోజుల 7 గంటలు
