అంతే గుంభనంగా దులిపేసుకున్న మోదీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త రాజధాని అమరావతి నిర్మాణం అనేది.. అణువణువూ సింగపూర్ అనే పదం చుట్టూతా పరిభ్రమిస్తూ ఉన్నది. అయితే సింగపూర్ ఈ విషయంలో ఎంత మేరకు ఏపీకి చేయూత అందిస్తుంది అనే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి క్లారిటీ లేదు. కాగా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సింగపూర్ ప్రధానమంత్రి ఏపీ, అమరావతి ప్రాంతాన్ని కకూడా సందర్శిస్తారని చంద్రబాబు తొలుత ప్రచారం చేశారు.
అయితే ఆయన భారత పర్యటన ప్రస్తుతం మొదలైపోయింది. ఢిల్లీలో ఉంది. అటునుంచి రాజస్థాన్‌కు వెళుతుంది. ఇన్ని జరిగినా.. సింగపూర్ ప్రధాని ఏపీకి రాబోతున్న సంకేతాలు మాత్రం రావడం లేదు. ఆయన వచ్చి ఉంటే.. చంద్రబాబు చెబుతున్నట్లుగా.. ఏపీలో రాజధాని నిర్మాణ బాధ్యతను మొత్తం సింగపూర్ ఏమేరకు తీసుకుంటుందో ఆలోచించవచ్చు. కానీ ఆయన ఏపీకి రావడం లేదు.
మనమే ఏపీ ఘనతను సింగపూర్ ప్రధానికి తెలియజెప్పడం ఎలాగ? ఆయన ప్రోగ్రాం అంతా ఎన్నడో ఫిక్సయిపోయి ఉంటుంది. చివరికి ఆయన పర్యటనలో ఏపీ ఉండేలా చంద్రబాబు చేయలేకపోయారు. కానీ ఆయన ఏపీకి రావడం లేదు. రాజస్తాన్ వెలుతున్నరు.
అయితే మోడీ తో మంగళవారం భేటీ సందర్భంగా, దాని తర్వాత.. మోదీ మాట్లాడుతూ ఏపీ కొత్త రాజధాని నిర్మాణంలోనూ సింగపూర్ సహకరిస్తుందని ఒకే మాట అనేసి ఊరుకున్నారు. ఒకే మాట తప్ప.. ఏపీకి సింగపూర్ ఏం చేస్తుందో ప్రధాని ఎలాంటి వివరాలూ తాను హామీ ఇవ్వదలచుకోలేదు. కనీసం ప్రకటించడం కూడా ఇష్టం లేనట్లు ఉండిపోయారు. మొత్తానికి భారత్ వచ్చి కూడా ఏపీకి రాకుండా సింగపూర్ ప్రధాని వెళ్లిపోవడం అంటే.. ఆ సంకేతం రాజధానికి మంచిది కాదని పలువురు అంటున్నారు.

