Mon Feb 02 2026 07:48:36 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో జికా వైరస్
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతుంది. ఒక వృద్ధుడికి జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతుంది. ఒక వృద్ధుడికి జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. పూనే లోని బవ్థాన్ ప్రాంతంలో 67 సంవత్సరాల వ్యక్తి జికా వైరస్ బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
వృద్ధుడికి....
అయితే జికా వైరస్ బారిన పడిన వృద్ధుడి ఆరోగ్య పరిస్థిితి నిలకడగానే ఉందని తెలిపింది. నవంబరు 6న ఆయన నాసిక్ నుంచి పూనేకు రాగా దగ్గు, కీళ్లనొప్పులు వచ్చాయి. దీంతో ఆయన స్థానిక జహంగీర్ ఆసుపత్రిలో చేరారు. అనుమానం వచ్చిన వైద్యులు వృద్ధుడి రక్తనమూనాలను ల్యాబ్ కు పంపగా జికా వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story

