Mon Dec 15 2025 08:14:42 GMT+0000 (Coordinated Universal Time)
Zero Shadow : బెంగళూరులో నీడ మాయం
బెంగళూరులో జీరో షాడో కనిపించింది. నగర వాసులను అలరించింది

బెంగళూరులో జీరో షాడో కనిపించింది. నగర వాసులను అలరించింది. బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటలనుంచి 12.23 గంటలవరకూ జీరో షాడో ఉంది. నీడ కనిపించకుండా పోయే ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు అనేక మంది ఆసక్తి కనపర్చారు.
అద్భుత దృశ్యం...
బెంగళూరు నగరంలో సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు ఈ జీరో షాడో ఏరపడుతుందని, భూమి సూర్యుడి చుట్టు తిరుగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో దాని స్థానం మారుతుంటుందని, ఏడాదిలో రెండు వేర్వేరు సమయాల్లో సూర్యుడు భూమికి నిటారుగా వస్తాడని అస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చెబుతుంది. నీడ మాయం కావడం బెంగళూరులో ఇదే మూడో సారి జరిగిందంటున్నారు.
Next Story

