Thu Dec 18 2025 10:20:42 GMT+0000 (Coordinated Universal Time)
ఆ టైమ్ లో వెళ్తే.. ఎమ్మెల్యేకైనా చెంప పగుల్తది
భారీ వర్షాల కారణంగా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలను వరదలను ఎదుర్కొంటూ ఉన్నాయి. చాలా ప్రాంతాలలో

భారీ వర్షాల కారణంగా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలను వరదలను ఎదుర్కొంటూ ఉన్నాయి. చాలా ప్రాంతాలలో స్థానిక నాయకులు పర్యటిస్తూ ఉన్నారు. అక్కడి పరిస్థితులను తెలుసుకుంటూ ఉన్నారు. అలా ఓ వరద ప్రభావిత ప్రాంతంలో పరిస్థితులను తెలుసుకోడానికి వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు ఊహించని పరిస్థితి ఎదురైంది. హర్యానాలో వరదల సమయంలో తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ మహిళ ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించింది. బుధవారం ఘులాలో పరిస్థితిని సమీక్షిస్తున్నప్పుడు జననాయక్ జనతా పార్టీ (జెజెపి) ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ను ఆమె చెంపదెబ్బ కొట్టారు. ఘగ్గర్ నది పొంగిపొర్లడంతో ఆ ప్రాంతంలో వరదల పరిస్థితిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ఇప్పుడు ఎందుకు వచ్చావు?", అని ఆమె శాసనసభ్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆయన చుట్టూ ప్రజలు గూమికూడి ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ ఘటనపై జెజెపి ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఒక గ్రామంలో వరద పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లినప్పుడు ప్రజలు తనను దూషించారని అన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని నేను ఆమెకు వివరించినప్పటికీ ఆమె తనని కొట్టిందని అన్నారు. ఆమె చేసిన పనిని తాను క్షమించానని..ఆమెపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోనని అన్నారు. హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో జేజేపీ భాగం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తర్వాత ఘగ్గర్ నది పొంగిపొర్లడంతో పంజాబ్, హర్యానాలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story

