Sat Mar 07 2026 22:28:13 GMT+0530 (India Standard Time)
బెంగళూరు కు వరుణ్ సింగ్ తరలింపు
వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ ను బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆయనకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు

వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ ను బెంగళూరుకు తరలించారు. నిన్న హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన వరుణ్ సింగ్ వెల్లింగ్టన్ క్యాంప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ముఖానికి, తలకు బలమైన గాయాలయ్యాయి. అయితే వెల్లింగ్టన్ క్యాంప్ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆయన తండ్రి సూచన మేరకు బెంగళూరుకు తరలించారు.
సర్జరీలు అవసరమని...
బెంగళూరుకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కొన్ని సర్జరీలు అవసరమని వైద్యులు భావిస్తున్నారు. బెంగళూరుకు ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చారు. వరుణ్ సింగ్ ప్రమాదం నుంచి బయటపడితే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలిసే అవకాశముంది. వరుణ్ సింగ్ ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డు తో సత్కరించింది.
Next Story

