బాబాకు రైల్వే పట్టాల మీద కోపమెందుకంటే?
ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్.

ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. ఒడిస్సాలో స్థిరపడిన విజయ్ కుటుంబాన్ని వదిలేసి హఠాత్తుగా బాబా అవతారం ఎత్తాడు. భిక్షాటన చేసుకుంటూ జీవించడం, కనిపించిన రైలు ఎక్కడం, నచ్చిన చోట దిగడం అతడి దినచర్య. రైలులో ఒడిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓం బాబాను టిక్కెట్ లేని కారణంగా టీసీ మార్గమధ్యంలో దింపేశారు. దీంతో ఏకంగా రైల్వేల మీదనే కక్ష పెంచుకున్నాడు.
కాచిగూడ–బుద్వేల్ మధ్య రైలు పట్టాలపై పెద్ద కర్రలు, రాళ్లు పెట్టాడు. వీటిని గుర్తించిన గ్యాంగ్మెన్లు తొలగించి, ఆర్పీఎఫ్కు సమాచారం ఇచ్చారు. కాటేదాన్ ప్రాంతంలో రైలు పట్టాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓంను గుర్తించిన ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో ఈ నేరాలు తానే చేసినట్లు అతడు అంగీకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల చైన్నె వెళ్లిన ఓం అక్కడా ఇలాంటి పనే చేశాడు. ఎన్ఐఏ ఈ ఘటనల వెనుక ఉగ్రకోణం ఉందని అనుమానించింది. కానీ చివరకు ఇది ఓం బాబా పనిగా తేలింది.

