Fri Dec 05 2025 13:35:42 GMT+0000 (Coordinated Universal Time)
రేపు పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకండి: అసదుద్దీన్ ఒవైసీ

మెల్బోర్న్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు.. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రపంచ కప్ లో భారత్ పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకూడదని అన్నారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత జట్టును పంపకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో క్రికెట్ ఎందుకు ఆడుతోందని ప్రశ్నించారు. ''పాకిస్థాన్‌తో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? ఆడకూడదు.. మేము పాకిస్థాన్‌కు వెళ్లము.. ఆస్ట్రేలియాలో వారితో ఆడుకుంటామని అనడం కరెక్ట్ కాదు. ఇదెక్కడి ప్రేమ? పాకిస్థాన్‌తో ఆడకండి.. ఏం జరుగుతుంది. మీరు పాకిస్తాన్‌తో ఆడకపోతే? టెలివిజన్‌కి ₹2000 కోట్ల నష్టం? అంతేకదా ఆడకండి, "అని ఒవైసీ వ్యాఖ్యలు చేసారు.
వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన ప్రకటనపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆదివారం పాక్ తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని.. ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసేందుకు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తమవంతు కృషి చేయాలని కోరుకుంటున్నానని అసదుద్దీన్ అన్నారు. ఓ పార్టీ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story

