Sun Apr 05 2026 22:44:22 GMT+0530 (India Standard Time)
తల్లి, చెల్లెలు ఒత్తిడి.. రెండో పెళ్లి చేసుకోబోతున్న ముఖ్యమంత్రి
గురుప్రీత్ కౌర్ వయసు 32 ఏళ్లు. కౌర్ కుటుంబం కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి

పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ సింగ్ గురువారం నాడు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో ఆయన రెండో వివాహం చేసుకుంటున్నారు. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో జరుగనున్న ఈ ప్రైవేట్ వేడుకకు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు.
సీఎం భగవంత్ మాన్ సింగ్‌కు ఇంతకు ముందు ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లయింది. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్‌పీత్ర్ కౌర్, ఆయన విడిపోయారు. భగవంత్ మాన్కు తొలి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆయన మరో పెళ్లి చేసుకోవాలని తల్లి, సోదరి సూచించారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని తల్లి, చెల్లెలు కోరడం వల్లే భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తల్లి, చెల్లెలే ఈ సంబంధం తీసుకొచ్చినట్లు సమాచారం. వారిద్దరికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్ కౌర్‌ను ఎంపిక చేశారు. గురువారం చండీగఢ్‌లోని భగవంత్ మాన్ సింగ్ నివాసంలో గురుప్రీత్ కౌర్‌తో ఆయన రెండో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరగబోతోంది.
గురుప్రీత్ కౌర్ వయసు 32 ఏళ్లు. కౌర్ కుటుంబం కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి చెందినది. ఆమె తండ్రి ఇందర్జిత్ సింగ్ రైతు. ఆమె తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి. విదేశాల్లో ఉంటున్న ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మాన్కు వారి కుటుంబాలతో సంవత్సరాలుగా అనుబంధం కలిగి ఉన్నాయని చెప్పారు. ఆమె మేనమామ, గురీందర్ జీత్ మాట్లాడుతూ.. గురుప్రీత్ ఎప్పుడూ చదువులో ముందుండేది. ఆమె ముల్లానా మెడికల్ కాలేజీలో చదువుకుంది, ఆమె బంగారు పతక విజేత అని ఆమె మామ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కౌర్ కూడా భగవంత్ మాన్కు సహాయం చేసిందని పలువురు తెలిపారు.
భగవంత్ సింగ్ మాన్ మొదట హాస్యనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి చేరడానికి ముందు నటనలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పంజాబ్ క్యాబినెట్ కు నాయకత్వం వహిస్తున్నాడు. జనవరి 2022లో పంజాబ్ ముఖ్యమంత్రి AAP అభ్యర్థిగా ఎంపికయ్యారు. పంజాబ్‌లోని సంగ్రూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ నుండి రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.
News Summary - Punjab CM Bhagwant Mann going to marry Dr Gurpreet Kaur
Next Story

