Thu Mar 19 2026 20:17:53 GMT+0530 (India Standard Time)
ఏడడుగులు వేస్తుండగా విషాదం
పెళ్లి జరుగుతుండగా వరుడు గుండెపోటుతో మరణించడంతో పెళ్లిపందిట్లో విషాదం నెలకొంది. ఉత్తరాఖండ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది

పెళ్లి జరుగుతుండగా వరుడు గుండెపోటుతో మరణించడంతో పెళ్లిపందిట్లో విషాదం నెలకొంది. ఉత్తరాఖండ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వధువు, వరుడు ేతిలో చేయి వేసి ఏడడుగులు నడుస్తుండగా వరుడు ఒక్కసారి కుప్పకూలి పోయాడు. ఉత్తరాఖండ్ లోని నంద్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుండెపోటుతో...
దంతవైద్యుడిగా పనిచేస్తున్న సమీర్ ఉపాధ్యాయ వివాహం నిన్న జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులందరూ కలసి వరుడిని పెళ్లిమండపం వద్దకు తీసుకు వచ్చారు. అనంతరం వధువుతో కలసి ఏడడుగులు వేస్తున్న సందర్భంలో సమీర్ ఉపాధ్యాయ ఒక్క సారిగా పెళ్లిమండపంలో కుప్ప కూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే సమీర్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగానే సమీర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.
Next Story

